![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-8 తెలుగు(Biggboss 8 Telugu) లో పదకొండో వారం ముగింపుకి వచ్చేసింది. ఈ వీక్ అంతా ఫ్యామిలీతో హౌస్ మేట్స్ గడిపేసారు. ఇక ఝ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకూ జరిగిన అఫిషియల్ ఓటింగ్ లో విష్ణుప్రియ, పృథ్వీ చివరి రెండు స్థానాలలో ఉన్నారు. వారిపైన యష్మీ ఉంది. ఇక టేస్టీ తేజ, అవినాష్ వారికంటే కాస్త బెటర్ ఓటింగ్ తో టాప్ లో ఉన్నారు. అయితే ఫ్యామిలీ వీక్ లో తేజ వాళ్ళ మదర్(అమ్మ) రావట్లేదని బిగ్ బాస్ మొదట చెప్పారు. ఆ తర్వాత చాలాసార్లు టేస్టీ తేజ బయటకు వెళ్తాను.. ప్రతీవారం నేను డైరెక్ట్ నామినేషన్ లో ఉంటాను అని తేజ అన్నాడు. దీనిప్రకారం అతడికి వాళ్ల అమ్మ వచ్చిందనే ఆనందం ఉంది. అయితే హౌస్ లో ఉన్న బిగ్ బాస్ దత్తపుత్రిక విష్ణుప్రియ లీస్ట్ లో ఉండటంతో కొన్ని జిమ్కిక్కులు చేసి తేజని బయటకి పంపించేలా ఉన్నాడు. ఎందుకంటే విష్ణుప్రియ-పృథ్వీలు చేస్తున్న రోత రొమాన్స్ గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటుంటే ట్రెండింగ్ లో ఉండాలని కావచ్చు. ఇక మరోవైపు హౌస్ లో ప్రతీవారం తెలుగువాళ్ళే వెళ్తున్నారని విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో ఈ వారం పృథ్వీ, యష్మీలలో ఎవరినో ఒకరిని బయటకి పంపిస్తాడో చూడాలి.
అఫీషియల్ గా టేస్టీ తేజ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే హౌస్ లో మోస్ట్ వాల్యుబుల్ కంటెస్టెంట్ గా టేస్టీ తేజ గత వారమంతా ట్రెండింగ్ లో ఉన్నాడు. అతడిని ఎలిమినేషన్ చేస్తే బిగ్ బాస్ బయాజ్(పక్షపాతం) గా ఉన్నాడనే భావన బిబి ఆడియన్స్ లో కలుగుతుంది. మరి కన్నడ బ్యాచ్ నుండి ఎలిమినేషన్ చేస్తాడా లేదా కళామతల్లి ముద్దుబిడ్డ , మన బిగ్ బాస్ దత్తపుత్రికని ఎలిమినేషన్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
![]() |
![]() |